ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి
ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్, వెంకటాపూర్ గ్రామాల పరిధి కింద ఉన్న రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి లను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి సోమవారం జీవో జారీ చేసింది. పంచాయతీలుగా గుర్తించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామస్థులు టపాసులు పేల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బాలయ్య , నాయకులు తోట ఆగయ్య , మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.