ప్రత్యేక రాష్ర్టంతోనే పండగలకు ప్రాధాన్యత : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
పరిగిలో ఘనంగా బతుకమ్మసంబరాలు
పరిగి రూరల్,సెప్టెంబర్ 29, (జనం సాక్షి) :
ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాకే మన సీఎం కేసీఆర్ పండగలకు ప్రాధన్యత కల్పించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు కొప్పుల శారదా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ర్టం సిద్దించాకే మన పండగలకు గుర్తింపు లభించి, అధికారికంగా చేసుకోగలగుతున్నామన్నారు. హిందువులకు బతుకమ్మ, ముస్లింలకు రంజాన్, క్రైస్తవులకు క్రిస్టమస్ పండగలను గుర్తించి వారికి తోఫాలను అందజేస్తున్నారన్నారు. తెలంగాణ సాంప్రదాయాలను కట్టుబాట్లను, కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచించారు. ఈ బతుకమ్మ పండగలను ఉద్దేశించి ఎమ్మెల్యే సతీమని సాంప్రదాయాలు ప్రొత్సహించేలా బతుమ్మ ఆటకు వచ్చిన ప్రతి మహిళకు గాజులు తొగిడిస్తూ బతుమక్మ ఆటలకు స్వాగతం పలికారు. ప్రతిమారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మనమంతా ఐక్యంగా ఇలా ఒకే వేధికపై బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. గిరిజనులు వారి సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడారు.ఈ బతుకమ్మ సంబరాల్లో జెడ్పీటీసీలు బేతు హరిప్రియ, మేఘమాల, మున్సిపల్ వైస్ చైర్మన్ కల్లు ప్రసన్న లక్ష్మి , కౌన్సిలర్ అర్చన, బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్,నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవి, కౌన్సిలర్లు వేముల కిరణ్ కుమార్ గుప్త, వారాల రవీంద్రా, టీఆర్ఎస్ మహిళా విభాగం పరిగి మండల అధ్యక్షులు లక్ష్మీ, అనూష,గోపాల్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
29 పిఆర్ జి 01లో పరిగిలో బతుకమ్మ సంబరాలను ఉద్దేశించి మాట్లాడుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి,పక్కన ఆయన సతీమణి ప్రతిమారెడ్డి
02లో పరిగిలో గిరిజనులతో కలిసి బతుకమ్మను ఎత్తుకున్న ఎమ్మెల్యే సతీమణి ప్రతిమారెడ్డి
03లో పరిగిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
04లో పరిగిలో పేర్చిన బతుకమ్మ
05లో పరిగిలో బతుకమ్మను ఎత్తుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సతీమణి