ప్రపంచ రికార్డు @ కెప్టెన్ రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 3443 పరుగులు (129 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి.తాజా ఫామ్ (తొలి టీ20లో 64 పరుగులు) ప్రకారం చూస్తే.. రోహిత్ ఈ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 16000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 44 పరుగుల దూరంలో ఉన్నాడు.అలాగే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 11 సిక్సర్లు బాదగలిగితే అంతర్జాతీయ టీ20ల్లో కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (169) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమిస్తాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏవంటే..