ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న యోగా దినోత్సవం
న్యూఢిల్లీ,జూన్ 19(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న 191 దేశాలు సెలబ్రేషన్స్ జరుపుకోనున్నట్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆదివారం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలకు గానూ 191 దేశాలు ‘యోగా డే’ నిర్వహిస్తాయన్నారు. కేవలం లిబియా, యెమెన్ దేశాలు వీటికి దూరంగా ఉన్నాయని చెప్పారు. భారత్ లో మాత్రమే కాదు విదేశాలలోనూ గతేడాది కంటే రెట్టింపు సంఖ్యలో యోగా డే లో పాల్గొంటారని పేర్కొన్నారు. పోలాండ్ లో సెలబ్రేషన్స్ లో పాల్గొనాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో అక్కడికి వెళ్లడం లేదని వెల్లడించారు. 177 దేశాలు మద్దతుగా ఓటు వేసినందుకు ‘యోగా డే’కు యూఎన్‌వో
ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
చైనా, పాక్‌లలో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు చైనా, పాకిస్థాన్‌లలో పలుచోట్ల వేడుకలు జరిగాయి. చైనాలోని వుక్సీ హాలీవుడ్ స్టూడియోలో యోగా డేను జరుపుకున్నారు. వుక్సీలోని సుమారు 3500 మంది యోగా అభిమానులు ఇందులో పాల్గొని యోగాను అభ్యసించారు. వారం రోజుల పాటు దేశమంతటా రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాలను చైనా జరుపుకోనుంది.స్థానికంగా ఉన్న భారత ఎంబసీతో కలిసి యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. వేల మంది చైనీయులు ఉత్సాహంగా పాల్గొని యోగా నేర్చుకుంటున్నారు. భారత దౌత్యవేత్త బాల భాస్కర్ ఈ సందర్భంగా యోగా డేపై ప్రధాని మోదీ సందేశాన్ని చదివి వినిపించారు. అటు పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్‌లోనూ యోగా డే వేడుకలు జరుపుకున్నారు.