ప్రభుత్వం నా భద్రత కుదించింది

శశికుమార్‌

హైదరాబాద్‌ : ప్రభుత్వం తనకు అకారణంగా భద్రత కుదించిందని ఓఎంసీ అక్రమాల కేసులో కీలక సాక్షి సి. శశికుమార్‌ ఆరోపించారు. కొందరు పోలీసు ఉన్నాతాధికారులు, కేసుతో ప్రమేయమున్న ఓమంత్రి ప్రోద్బలంతో తనకు భద్రత తగ్గించారని విమర్శించారు. ఒక్కో షిఫ్ట్‌కు నలుగురు చొప్పున గన్‌మెన్‌ కేటాయించినట్లు హైకోర్టుకు చెప్పిన హోంశాఖ … ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు తగ్గించారని శశికుమార్‌ ప్రశ్నించారు. కనీసం సీబీఐ జేడీకి కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. తనను బెదిరించడం ద్వారా గాలి జనార్దన్‌రెడ్డి నుంచి లబ్ది పొందవచ్చనే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. తమ ప్రాణాలకు హాని జరిగితే ప్రభుత్వమే బాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ తాము సాక్ష్యం చెప్పి తీరుతామని స్పష్టం చేసిన శశికుమార్‌… సాక్షులకు భద్రత కల్పించేందుకు సీబీఐ తగిన చొరవ చూపాలని కోరారు.