ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి పథకాన్ని పూర్తి చెయ్యాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ

జనం సాక్షి, చెన్నరావు పేట

వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య శాఖ మంత్రి నిర్దేశించిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. మంగళవారం ప్రాథమిక అరోగ్య కేంద్రంలో అరోగ్య మహిళ డే కార్యక్రమాన్ని ఆయన సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో మొదలు పెట్టిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నందున ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పాలని, జ్వరం వస్తే వెంటనే ప్రాథమిక అరోగ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో ఫీవర్ సర్వే చేపట్టాలని వైద్యాధికారికి సూచించారు.ముఖ్యంగా గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రపంచ మానసిక అరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రామాలలో మానసిక సమస్యలతో బాధ పడుతున్న బాధితులకు టోల్ ఫ్రీ నంబర్ 14416 కి కాల్ చేసి వారి సమస్యలను దూరం చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఏంహెచ్ఓ ప్రకాశ్, వైద్యాధికారి సరోజ, సిహెచ్ఓ వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.