ప్రభుత్వం పెంచిన వేతనాన్ని అమలు చేసే వరకు పోరాడుతాం .. కోలిశెట్టి *యాదగిరిరావు
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను విడుదల చేసి వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉమ్మడి మేళ్లచెరువు మండల మధ్యాహ్న భోజన కార్మికుల ఉమ్మడి మహాసభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగావారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులకు తొమ్మిది పది తరగతుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 2000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని వారు అన్నారు . మధ్యాహ్న భోజన కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మహిళలకు కాటన్ డ్రెస్సులు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని స్కూళ్లలో వంట షెడ్లు ను నిర్మించాలని వారన్నారు కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలని లేనట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులంతా ఐక్యమై ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు అన్నారు.
ఈ యొక్క సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వట్టేపు సైదులు షేక్ యాకోబు మిట్టగనపుల ముత్యాలు. బుబమ్మ లక్ష్మి మరియమ్మ మైసమ్మ కరుణ సైదమ్మ మాధవి ప్రమీల తదితరులు పాల్గొన్నారు