ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం: వెంకటరెడ్డి
చిగురుమామిడి: మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ రాంగోపాల్ రెడ్డి, మండల సీపీఐ కార్యదర్శి స్వామి. మాజీ ఎంపీపీ బండారి సరళ, మాజీ జెడ్పీటీసీ శోభారాణి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మల్లేశం , చినసామి తదితరులు పాల్గొన్నారు.