ప్రభుత్వ అధికారులు-కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షణలు.*

కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ రోజువారీ ప్రదక్షణలు-పడిగాపులు.

నేడు జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించిన వరదముంపు బాధితులు.

ప్రత్యేక చొరవ తీసుకొని పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకోలు.

 

బూర్గంపహాడ్ ఆగష్టు 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గత వరదల్లో దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించిన వరద ఆర్ధిక సహాయం నిమిత్తం మండలంలోని సదురు గ్రామాల్లో చాలామందికి సైతం ఇంకా వరద సాయం అందని పరిస్థితి నెలకొన్నది. నిత్యం మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫలితం లేకపోవడంతో నేడు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి అర్హులైన గోదావరి వరద ముంపు బాధిత ప్రజల దరఖాస్తుల విషయంలో మరలా ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేకూర్చాల్సిందిగా బాధిత ప్రజలు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల వరద బాధిత ప్రజలు, స్థానిక పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.