-->

ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్న బిజెపి

ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరెలు
అర్హులందరికీ ఆసరా పెన్షన్లు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ లో బతుకమ్మ చీరెలు, ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ
రేగొండ (జనం సాక్షి): ఎన్నో ఏళ్లుగా కష్టపడి నెహ్రూ ప్రభుత్వ కాలం నుండి ఆస్తులను కూడా పెడితే కేంద్రంలో ఉన్న ప్రస్తుత బీజేపీ పార్టీ ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేస్తూ అమ్ముకుంటున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బుధవారం మండలంలోని రాయపల్లి, దామన్నపేట, దామరంచపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమనీకి ముఖ్య అతిథిగా భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై లబ్ధి దారులకు ఆసరా పెన్షన్ కార్డులు,బతుకమ్మ చిరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతుందని అన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరే సారే ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులను నిలిపివేసిందని అన్నారు. లేనిపోని ఆరోపణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని పై నిందలు వేస్తుందని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వం ఆస్తులను అన్నిటిని ప్రవేట్ పరం చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు దార దత్తం చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి,, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ లు, మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్ట్ వంటి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పున్నం లక్ష్మి రవి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నడి పెళ్లి విజ్ఞాన్ రావు, జెడ్పీ కొప్షన్ సభ్యులు రహీం, మండల అధ్యక్షులు అంకం రాజేందర్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి, సర్పంచ్ లు నడి పెళ్లి శ్రీనివాస్ రావు, జూపాక నీల నిలాబ్రం, గుండు బుచ్చమ్మ,. ఆంబల చందు, పబ్బా శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి లు ఐయిలి శ్రీధర్ గౌడ్, కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బోట్ల కవిత సామ్రాట్, బల్గురి సుష్మా స్వరాజ్, నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, మైస బిక్షపతి, సామల పాపి రెడ్డి, పట్టేం శంకర్, కోలెపాక బిక్షపతి, మధాడి కర్నకర్ రెడ్డి, బండి భద్రయ్య, బండి కిరణ్, కొడేపాక మొగిలి, దాట్ల రాజేందర్, దాట్ల రమేష్, పెరుమండ్ల మహేందర్, చల్లగురుగుల సుదర్శన్, తడక శ్రీకాంత్ గౌడ్, సమ్మయ్య, రాజు, రవీందర్, శ్రీపతి శ్రీనివాస్, కర్నే జ్యోతి, సిద్ధ సమ్మయ్య, మంద జయపాల్ తది తరులు పాల్గొన్నారు.