ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చేపమందు

పంపిణీకి భద్రతా ఏర్పాట్లు
అనురాగ్‌ శర్మ
హైదరాబాద్‌ : చేప మందు పంపిణీ కార్యక్రమంపై లోకాయుక్తలో విచారణ ముగిసింది. ఈ విచారణకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చేప మందు పంపిణీకి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనురాగ్‌ శర్మ తెలిపారు.