ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు


` ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు
` వారికి వ్యాపారంలో ప్రత్యేక రిజర్వేషన్‌లు
` ఇది పథకం కాదు…ఓ ఉద్యమం
` హుజురాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ
` దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం
` దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి
` ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డమీదినుంచే విజయవంతం చేసాం
` ఇదే సెంటిమెంట్‌ దళితబంధును కూడా విజయవంతం చేస్తుంది.
` యావత్‌ ప్రపంచానికి ఇదొక దిక్సూచి కానుంది
` హుజురాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌
హుజూరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):ప్రభుత్వ దళిత ఉద్యోగులకు కూడా దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. హుజూరాబాద్‌ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్‌ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలి. 25 ఏండ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ప్రారంభించాం. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాటలు రూపొందించాం. 25 ఏండ్ల నుంచి నా మస్తిష్కంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణగారిన, అణిచివేయబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయి. అంబేద్కర్‌ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయి.’ అని సీఎం అన్నారు. ’అయినా ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలి. ఇవాళ తెలంగాణ నుంచి చేసే పని దేశమంతా వ్యాపించాలి. ఇవాళ మేం చేస్తమంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. రెండు నెలల్లో హుజూరాబాద్‌లో పథకం అమలవుతుంది. మిగతా నియోజకవర్గాల్లో హుజూరాబాద్‌ దళితులే ఆదర్శం కావాలి. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. రైతుబంధు తరహాలోనే దళిత బంధు వస్తది. గవర్నమెంట్‌ ఉద్యోగులైన దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది.’ అని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు.’ఒకాయనకు 4 ఎకరాల భూమి ఉంటే రైతుబంధు వస్తున్నది. రైతుబంధు లాగే దళిత బంధు వర్తిస్తుంది. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివరి వరుసలో ఉండి తీసుకోవాలి. మన దళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి విూద అప్పులు ఉన్నాయి. అటువంటి వారికి మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ పోతాం. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇచ్చే హావిూ నాది. రెండు పూటలు పస్తులుండే వాళ్లు లక్షల మంది ఉన్నారు. వారు ముందుగా తీసుకోవాలి. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలే. 75 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలే. ఇది ప్రజాస్వామ్యం అయితే ప్రజలు ప్రభువులు అయితే దళితులు ఎందుకు ప్రభువులుగా లేరు. ఈ వివక్ష ఎన్ని శతబ్దాలు కొనసాగలే. ఇది ఉండకూడదు.’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.దళితబంధు ఓ పథకం కాదని..ఇది ఓ ఉద్యమమని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఇది ఆషామాషీగా ప్రకటిస్తున్నది కూడా కాదన్నారు. ఈ పథకం దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతున్నదని అన్నారు. దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ’దళిత బంధును విజయం సాధించితీరుతుందన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. గతంలో రైతుబంధు లాగా ఈ పథకం కూడా విజయం సాధించి అందరికీ చేరుతుందన్నారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. ’ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నది. వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగింది. కరీంనగర్‌ పట్టణంలో జరిగిన సభలో రైతుబీమా ప్రకటించాను. ఆ స్కీం అద్భుతంగా కొనసాగుతోంది. తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ జిల్లా తెలంగాణ సాధనలో తొలిసింహగర్జన నుంచి నేటి వరకు కూడా సెంటిమెంట్‌గా బ్రహ్మాండమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరే వేదికగా మారింది. ఈ క్రమంలోనే ఈ జిల్లా నుంచే అద్భుతమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాను. మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్రామ్‌కు పుష్పాంజలి ఘటించి శ్రీకారం చుడుతున్నాం.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళితబంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించి నప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవి. విూ అందరి దీవనెలతో రాష్ట్రం నలుమూలుల ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి 14, 15 సంవత్సారల కృషి తర్వాత రాష్టాన్న్రి సాధించుకున్నాం. ఇవాళ సగర్వంగా దీవిస్తున్నారు. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాం. ప్రతి రోజు ప్రతి నిత్యం విూ కండ్లముందు గ్రామాల్లో, మండలాల్లో, విూ అనుభవంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిన్ననే 75వ స్వాతంత్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చేయలేదు. ఈ పథకం ఏడాది కిందనే మొదలుకావాలి. కానీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వలేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. పక్కన బాంబులు పడ్డట్టు భయపడుతుండ్రు. దళితులు బాగుపడొద్దా. ఎవరెవరకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతకు మనవి చేస్తున్నా. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత విూ విూదనే ఉంది’ అని సీఎం తెలిపారు. మొత్తం మంత్రివర్గం, పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరపున నూటికి నూరు శాతం విజయవంతం చేస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హావిూ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నానని అన్నారు. తాను ఈ పథకం ప్రారంభించగానే కొందరు అపశకునం మాటలు మాట్లాడారని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపిఉల, ఎమ్మెల్యేలు, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.