ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు 3 వరకు గడువు
దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజస్టేష్రన్ చేసుకున్న వారే అర్హులు
హైదరాబాద్,మే30(జనంసాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు విద్యార్థులను దోస్త్ వెబ్‌సైట్ ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నెల 22న డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఈ దోస్త్ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం మూడు విడుతల్లో ప్రభుత్వం విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఆయా యూనివర్సీటీల అడ్మీషపన్‌ల కోసం నోటీఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో దోస్త్ వెబ్‌సైట్ ద్వారా కాకతీయ యూనివర్సిటీ కింద విద్యార్థులు జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టేష్ర్రన్ చేసుకునే అవకాశాన్ని ఉన్నత విద్యామండలి కల్పించింది. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ కళాశాలల్లో అన్ని మౌలిక వసతులను కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కల్పించింది. ఆయా జిల్లాల్లో విద్యార్థులకు ఈ కళాశాలలల ద్వారా మెరుగైన విద్య అందుతున్నది. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అందిస్తూ విద్యాబోధన చేస్తున్నారు.
తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహత్మాగాంధీ యూనివర్సిటీలకు ఆన్‌లైన్ విదానంలో అడ్మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వెబ్ సైట్‌ను
ఓపెన్ చేసి ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత సంవత్సరం, పుట్టిన తేది, అధార్, మొబైల్ నెంబర్, విద్యార్థి, తండ్రి పేరును నమోదు చేయాల్సి ఉంది. నమోదు చేసిన వెంటనే విద్యార్థి మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్టేష్రన్‌కు విద్యార్థులు రూ.200ను క్రెడిట్‌కార్డు, డిబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కళాశాల ఎంపికకు వెబ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థుల సీటు అలాట్‌మెంట్ అయినట్లుగా మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. విద్యార్థికి సీటు వచ్చి తనకు కళాశాల కేటాయించినప్పటికీ, మరల వేరే కళాశాల చేరాలని అనుకుంటే నేరుగా ఆ కళాశాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో దోస్త్ వెబ్‌సైట్‌లో మాత్రమే సీటు నిర్దారణ చేసుకోవాలి. వెబ్ సైట్ లోకి వెళ్లి సీటు నిర్దారణ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఆప్షన్‌లో లాగిన్ కావాలి. అక్కడ సూచించిన రుసుమును ఫీజుగా చెల్లించాలి. చివరి విడత వరకు తనకు నచ్చిన కళాశాశాలలో సీటు రాకపోతే మళ్లీ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కళాశాలలో చేరే అవకాశం సైతం కల్పించింది. దోస్త్ వెబ్‌సైట్‌లో రిజిస్టేష్రన్ చేసుకోలేకపోయిన విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టేష్రన్ చేసుకునే అవకాశం సైతం ఉన్నత విద్యామండలి కల్పించింది. జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు రిజిస్టేష్రన్ చేసుకునే అవకాశం ఉంది. జూన్ 1, 3, 4వ తేదీన ప్రత్యేక కేటగిరి కింద విద్యార్థుల సర్టిఫికేట్లను కళాశాల యాజమాన్యం పరిశీలించనున్నారు. రెండో విడత ప్రత్యేక కేటగిరి కింద విద్యార్థులు రూ.400 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 10న అడ్మిషన్ తొలి జాబితా, జూన్ 10 నుంచి 15 తేదీ వరకు అడ్మిషన్లు వచ్చిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్లోనే సెల్ప్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 15న రెండో విడతలో భాగంగా ప్రత్యేక కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలన అన్ని యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో ఉదయం 10గంటలకు ప్రారంభమతుంది. మూడో విడత కింద జూన్ 20న రెండో లిస్టులో సీట్ అలాట్‌మెంట్ వివరాల విడుదల చేస్తారు. లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జూన్ 20 నుంచి 25వరకు కళాశాలల్లో ఆన్‌లైన్‌ల్లో సెల్ప్ రిపోర్టు, కళాశాల ఫీజు చెల్లించాలి. అనంతరం జూన్ 29న ్గ/నైల్ సీటు అలాట్‌మెంట్ లిస్టు విడుదల కానుంది. చివరి లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జులై 1 నుంచి 4వరకు ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్‌లో సెల్ప్ రిపోర్టింగ్, ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండనుంది. అదేవిధంగా జులై 1న సెమిస్టర్-1 తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సూచనలు గమనించాలని అధికారులు సూచించారు.