ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు…

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 8
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గురువారం శంకరపట్నం మండలం మొలంగూర్ లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి కళాకారులు అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి రథసారథి కళాకారులు, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కళాకారులు వడ్లకొండ అనిల్, బాబ్జి, వాణి, కోమల ,రాజు, శ్రీధర్ ,నిజాముద్దీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.