ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవలంభిస్తున్న పథకాలను మండలంలోని అన్ని గ్రామాల రైతులు
సద్వినియోగం చేసుకోవాలని ఏ ఓ శోభారాణి అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఉచితంగా కందుల సంచులు పంపిణీ చేశారు. మండలానికి మొత్తం 40 కందుల సంచులు వచ్చాయని, మండల ప్రజా ప్రతినిధులతో కలిసి రైతులకు కందుల సంచులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జంగయ్య, గిరి నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొమ్ము రాజయ్య, ఏ ఓ శోభరణి, ఉపసర్పంచ్ నారాయణ, మండల నాయకులు బచ్చలకూర రమేష్, ఆలయ ధర్మకర్త రాచకొండ గోపి, కొమ్ము శ్రీను, పులిజ్వాల చంద్రకాంత్, బండి మల్లేష్, జయరామ్ మరియు వివిధ గ్రామాల ఏఈఓ అరుణ, ప్రవీణ్ కుమార్, అనూష, రైతులు, తదితరులు పాల్గొన్నారు.