ప్రభుత్వ ప్రకటనపై హర్షాతిరేకాలు టేకేదారుల కుటుంబాల్లో సంబురాలు.
దశాబ్దాల కాలం గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం లేక విలవిలలాడుతున్న బీడీ టేకేదారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. ఇకపై బీడీ కార్మికులు ఇస్తున్న విధంగానే టేకేదారు లకు ప్రతినెలా పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
*బీడీ టేకేదారులకు పింఛన్
ప్రభుత్వ ప్రకటనపై హర్షాతిరేకాలు
టేకేదారుల కుటుంబాల్లో సంబురాలు
ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా నాయకులు మండల నాయకులు అందర్నీ కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పాలాభిషేకం చేశారు. ధర్మపురి మండల వ్యాప్తంగా 500 మందికి ఆసరా
సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చిత్రపటానికి పాలాభిషేకం
జగిత్యాల జిల్లా/ ధర్మపురి పట్టణ, దశాబ్దాల కాలం గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం లేక విలవిలలాడుతున్న బీడీ టేకేదారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. ఇకపై బీడీ కార్మికులు ఇస్తున్న విధంగానే టేకేదారు లకు ప్రతినెలా పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో బీడీ కార్ఖానాలు నడిపిస్తున్న టేకేదారులకు కూడా మహిళలకు ఇస్తున్న మాదిరిగానే ప్రతినెల రూ.2116 పింఛన్ ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు మంత్రి కేటీఆర్ ప్రకటించడంలో టేకేదారులు హర్షం వ్యక్తం చేశారు.టేకేదారులు సంబురాలు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం బీడీ పరిశ్రమల్లో టేకేదారులు కమీషన్ ఏజంట్‌గా కార్ఖానాలను నడిపిస్తున్నారు. టేకేదారులకు బీడీ పరిశ్రమ ఉపాధిగా మారింది. బీడీ టేకేదారు మాట్లాడుతూ మా నాయకుడు సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట ఉంటామని, వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కే మల్లారెడ్డి ఉపాధ్యక్షుడు వెంకన్న, ధర్మపురి అధ్యక్షుడు బొద్దుల మల్లేశం ఉపాధ్యక్షుడు కొంపల నరసయ్య మరియు మచ్చ సత్యం, నేరెళ్ల రెడ్డవేని సత్యం, అశోకు, శ్రీనివాసు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.