ప్రభుత్వ బడులే ముద్దు ప్రైవేట్ బడులు వద్దు.

★ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ హైస్కూల్ లు
★ఇష్టానుసారంగా అధిక ఫిజులను వసూలు చేస్తున్న స్ప్రింగ్ ఫీల్డ్,శ్రీసాయి విజ్ఞాన్ ప్రైవేటు పాఠశాలలు.
★ప్రైవేట్ పాఠశాల బస్సులను అడ్డుకున్న భూంపల్లి వాసులు.
★నేటి నుండి గ్రామంలోకి బస్సులు రావద్దని డ్రైవర్లకు హెచ్చరించిన గ్రామస్థులు.
సదాశివనగర్ జూన్ 25(జనంసాక్షి) మండలంలోని స్ప్రింగ్ ఫీల్డ్ శ్రీ సాయి విజ్ఞాన్ హైస్కూల్ ప్రవేట్ పాఠశాలలు అధిక ఫిజులు వసూలు చేస్తున్నాయని  గ్రామస్థులందరు ఏకాభిప్రాయంతో వారి పిల్లలని ప్రయివేటు పాఠశాలలకు పంపబోమని శుక్రవారం తీర్మానం చేశారు.ఈ సందర్భంగా గ్రామానికి  స్ప్రింగ్ ఫీల్డ్స్ ,శ్రీ సాయి విజ్ఞాన్ స్కూళ్ల ప్రైవేట్ బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు.విద్యను వ్యాపారంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలకు మా పిల్లలను పంపించమన్నారు. రేపటినుండి ప్రైవేట్ పాఠశాల బస్సులు మా గ్రామానికి రావద్దని బస్సు డ్రైవర్ లకు సూచించారు.విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో ఫీజుల కోసం  గవర్నరింగ్ బాడీ నిర్ణయం ప్రకారమే ఫీజులను  నిర్ణయించాలి కానీ స్ప్రింగ్ఫీల్డ్ శ్రీ సాయి విజ్ఞాన్  హై స్కూల్  ప్రైవేట్ కార్పొరేట్ యజమానుల ఇష్టానుసారంగా అడ్మిషన్ యూనిఫామ్ పుస్తకాలు బస్సు ఫీజు తరతరవి పాఠశాలకు సంబంధించినవి అన్ని వారి దగ్గరనే కొనాలని ఒత్తిడి తెస్తూ వాటి పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.ప్రవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కి దౌర్జన్యంగా ఇట్టి రెండు ప్రయివేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నయని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని గ్రామస్థులు నినాదాలు చేస్తూ ఇప్పటినుండి ప్రవేట్ పాఠశాలకు మా పిల్లలను పంపించమని గ్రామ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని గ్రామస్తులన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు