ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు
వినుకొండ, జూలై 10 : వినుకొండ పట్టణంలో డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ డ్యానియల్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆక్రమణదారులపై విఆర్‌వో రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినుకొండ తహశీల్దార్ జానీబాషా ఆదేశాల మేరకు గుడిసెలు వేసిన భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనలు అధిగమించి భూములు ఆక్రమించే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌వోలు అమల, రాధ, రామారావు, వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.