ప్రభుత్వ మిగులు భూములను దళితులకు పంచాలి

కరీంనగర్‌: ప్రభుత్వ మిగులు భూములను దళితులకు కేటాయించి పట్టాస్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంఘం తెలంగాణ మాదిగా దండోరా నేతగాని సంఘం, బేడా బుడిగా జంగ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్‌ మట్టడించారు. సర్వే నెం199-210లోని మిగులు భూములను త్వరితగతిన దళితులకు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.