ప్రభుత్వ హాస్టల్ వసతి లేక విద్యకు దూరం అవుతున్న విద్యార్థులు

*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన…
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 20(జనం సాక్షి)
ప్రతి విద్యార్థికి హాస్టల్లో సీట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం నగరంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల ఎదుట ఎస్ ఎఫ్ ఐ నగర కమిటీ ఆధ్యర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కాంపెళ్ళి అరవింద్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న sc,st,bc, ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని కోరరు , అదే విధంగా ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాస్టల్లో వసతి కల్పించుకోవడం వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని అన్నారు . గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్ వసతి కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవడానికి వెళితే తీసుకోకుండా వార్డెన్స్ రిటర్న్ పంపిస్తున్నారు దీని వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఈబ్బందులు పడుతున్నారు , అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు,ప్రభుత్వ హాస్టల్లో సీట్ రాకపోవడం ద్వారా ప్రైవేట్ హాస్టల్లో ఉందం అనుకుంటే ఒక విద్యార్థి వద్ద నుండి 4000 వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రతి ప్రభుత్వ హాస్టల్స్ లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వ అధికారులు స్పందించి వసతి కల్పించాలని అన్నారు.SRR విద్యార్థులకు ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు, కళాశాల ఆటనమస్ కావడం ద్వారా విద్యార్థులు ఉత్తర తెలంగాణా అయిన మారుమూల ప్రాంతం కటరం ,మహదేవ్ పుర్ ,ఉమ్మడి అదిలాబాద్ విద్యార్థులు కళాశాల లో చేరుతున్నారని వారికి హాస్టల్ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో ప్రభుత్వ హాస్టల్ ఏర్పాటు చేయాలి,ప్రతి హాస్టల్ లో కెపాసిటీ ఉన్న వద్ద సీట్ల సంఖ్య పెంచాలి, అద్దె భవనంలో లో ఉన్న హాస్టల్స్ కు స్వంత భవనాలు నిర్మాణం చేయాలని జిల్లా బిసి,ఎస్ సి మంత్రులను జిల్లాలో మూతపడిన ప్రీ మెట్రిక్ హాస్టల్లో పోస్టుమెటీగా మార్చాలన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించకుంటే మంత్రుల ఇండ్లను ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .

 

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు తిప్పరపు రోహిత్ కళాశాల కమిటీ నాయకులు ఇషక్ ,ఆదిత్య, సాయి కృష్ణ, ఆశిష్, గోపాల్,వంశీ, మణిదీప్, మనోజ్, కుమార్,రాజు,శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…