ప్రమాదపు శాత్తు విద్యుత్ ఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి

టేకులపల్లి, అక్టోబర్ 12( జనం సాక్షి): ప్రమాదపు శాత్తు విద్యుత్ పోల్ పైనే ప్రైవేటు ఎలక్ట్రిషన్ లైను రిపేరు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన టేకులపల్లి మండలంలోని శంభునిగూడెం గ్రామపంచాయతీ ఒడ్డుగూడెం గుంపు సమీపాన బుధవారం ఉదయం జరిగింది. జి కొత్త తండా గ్రామపంచాయతీ కి చెందిన బానోతు వీరన్న(40) ప్రైవేటు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తుంటాడు. ఒడ్డుగూడెం గుంపు సమీపాన మూడు గ్రామాలకు వెళ్లే త్రీ పేజ్ లైన్ ప్రాబ్లం ఉన్నట్లు తెలపడంతో వీరన్న ఎల్ సి తీసుకుని విద్యుత్ పోల్ ఎక్కి లైన్ సరి చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై వీరన్న మృతి చెందాడు. విద్యుత్ పోల్ యంగ్లర్లపై కూర్చున్న విధంగానే మృతి చెందడం పట్ల విద్యుత్ సరఫరా ఎలక్ట్రిషన్ వీరన్న పైన ఉండగానే ఇవ్వడం మూలానే విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఎల్ సి తీసుకోకుండా ఎక్కినట్లయితే పైన కూర్చోక ముందే షాకు గురై కింద పడిపోయేవాడని అక్కడ స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలిసిన వెంటనే టేకులపల్లి ఎస్సై భూక్య శ్రీనివాస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను, విద్యుత్తు సిబ్బంది తో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.