ప్రముఖ గజల్ గాయకుడు మృతిపై జనంసాక్షి ప్రత్యేక కథనం
పాకిస్థాన్: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్ గాయకుడు మోహిదిహాసన్ కరాచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఆయన నేడు తుది శ్వాస విడిచాడు. ఆయన 1927లో రాజాస్థాన్‌లోని లూన ప్రాంతంలో ఆయన జన్మించాడు.
ప్రపంచ వ్యాప్తంగ ఉన్న ఆయన అభిమానులు గజల్ కింగ్‌గా పిలిచేవారు. సంగీత కారుల కుటుంబంలో పుట్టిన ఆయన సంగితంలో ఆయనది పదహారో తరమని చెప్పెవారు. చిన్న వయసు నుంచే ద్రుపద్, ఖయాల్ పాడుతూ ప్రదర్శనలిచ్చిన మెహది 20 ఏళ్ళ వయసులో దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌లో స్థిర పడ్డారు. ఆర్థికంగా కష్టాలు వచ్చినాయి. అప్పుడు ఆయన సైకిల్ రిపేర్ చేసే దుకాణం పెట్టుకున్నాడు. క్రమేపి అది కాస్త దీపంలా వెలుగుతూ కార్లు, ట్రాక్టర్స్, రిపేర్ చేసే దుకాణంగా మార్చారు.
ఎన్ని పనులున్న కూడా ఆయన సంగీతం మరవలేదు. 1957లో రేడియో పాకిస్థాన్‌లో పాడే అవకాశం లభించి గాయకుడిగ అందరికి పరిచయం అయినాడు ఆయన కష్టాలు తీరాయి. ఈయనకు ఉర్థు కవిత్వం అంటే ఎనలేని ఇష్టం. నెమ్మదిగా గజల్స్ పాడటం ఆరంభించాడు.
రేడియో అధికారుల ప్రోత్సహం అభించడంతో ఇక వెను తిరిగి చూడలేదు. చలన చిత్రల్లోను ఆయన పాడుతూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనకు ప్రతీష్ఠత్మక అవార్డులతో ఆయనను సత్కరించింది. ఆరోగ్యం సహకరించక పోవటంతో 80వ దశకం నుండి పాడటం తగ్గించేశాడు.