ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత
ఆదిలాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత ఏడాది ‘ స్వరలయలు’ రచనకుగాను ఆయనకు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించాయి, రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సాహితీ అకాడమీ పురస్కారాన్ని అందించింది. తెలుగు, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సాహిత్య పురస్కారంతో గౌరవించింది, యాది అనే రచనతో సాహితీ జగత్తులో సదాశివకు ప్రముఖ స్థానం అభించింది. ఆయన హిందూస్థాని రచనలు వివధ భాషాల్లోకి అనువాదం చెందాయి. తెలుగు, మురాఠి, పార్శీ భాషల్లో ఆయన పలు రచనలు చేశారు.