ప్రయాణం…. నిత్య నరకం…!
.మరమ్మతులకు స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు
.అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం
.శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు
వేమనపల్లి, సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
అటవీ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం రోడ్డు నిర్మాణాలు పటిష్టంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఈ తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల రోడ్లు,ఒర్రెలు,
వంతెనలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే మామడ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలోని ఒరె భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది.దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించడం వీలు కావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, పలు పత్రికలలో ప్రచురితమైనప్పటికీ పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.