ప్రవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ లను ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య సిబ్బంది

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 22 (జనం సాక్షి):
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. చందు నాయక్ ఆదేశాల మేరకు మూడు వైద్య బృందాలు జిల్లాల్లో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ,నర్సింగ్ హోమ్స్,స్కానింగ్ సెంటర్స్,
డయాగ్నస్టిక్ సెంటర్స్ నీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 ప్రకారము జోగులమ్మ గద్వాల జిల్లాలోని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండ క్వాలిఫై డాక్టర్స్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్,క్వాలిఫైడ్ స్టాఫ్, లేకుండ నిర్వహించే ప్రైవేట్ హాస్పిటల్స్,నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, స్కానింగ్ సెంటర్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ ఎవరైనా నిర్వహించినచో నోటీసులు ఇస్తామని, ఇచ్చిన నోటీసుకు సరియైన వివరణ ఇవ్వనిచో సీజ్ చేస్తామని ఆదేశించారు.
ఎ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ అయిన ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వారు మాత్రమే ఆ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్లో సేవలు అందించాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాకుండా, అన్ క్వాలిఫైడ్ వారు సేవలందించిన ఎడల, తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప,మాత శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ యస్. శశికళ,ప్రోగ్రాం ఆఫీసర్ మారుతి నందన్ గౌడ్,ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇర్షాద్,డాక్టర్ రవికుమార్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది ఎం. రామకృష్ణుడు,కోట్ల.మధుసూదన్ రెడ్డి ,టి. నర్సింలు,
శ్యాంసుందర్ పాల్గొన్నారు.