ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
సిద్దిపేట,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : వినాయక నిమజ్జన వేడుకలను సమన్వయంతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు అన్నారు. అధికారులు, పోలీసులు, వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక మండపాల నిర్వాహకులు, శాంతికమిటీ సభ్యులు, అధికారులు, పోలీసులు సమన్వయంతో కలిసి నిమజ్జన వేడుకలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారన్నారు.


