ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష

 జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు
వనపర్తి ఆగస్టు 28 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారము కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల,స్కాలర్స్ జూనియర్ కళాశాల మొదలగు పరీక్ష కేంద్రాల దగ్గర బందోబస్తును జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ను వనపర్తి జిల్లాలో 36 సెంటర్లలో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామన్నారు.ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ రద్దీనీ నియంత్రించడానికి ప్రధాన కుడళ్ళ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు.
పరీక్ష కేంద్రాల నోడల్ అధికారి వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ కానిస్టేబుల్ పరీక్షల రీజినల్ కో-ఆర్డినేటర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు.పరీక్ష సెంటర్లలో అభ్యర్థుల బయోమెట్రిక్ చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని,36 పరీక్ష కేంద్రాలలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు మొత్తం 9701 మంది కి గాను 9094 మంది హాజరు కాగా,612 పరీక్షకు గైహాజరైనారనీ మొత్తం 93:69% శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎస్పీ తెలిపారు.