ప్రశాతంగా గ్రూప్-2 మొదటిరోజు పరీక్ష
హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మిగిలిన రెండు పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. మొదటి రోజు పరీక్షకు సంబందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. పాతబస్తీ, బండ్లగూడలో సుమారు 30మంది అభ్యర్థులు పదినిమిషాలు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. వారిని అధికారులు లోనికి అనుమతింవచలేదు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మాదాపూర్, జేఎన్‌టీయూ, మియాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కొందరు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారనిపలువురు ఆరోపించారు. ఆదివారం ఉదయం జరిగే రెండో పేపరు ఉదయం 10గంటల నుంచి12:30వరకు మధ్యాహ్నం 2నుంచి 4:30వరకూ మూడో పరీక్ష జరుగుతాయి.