ప్రశ్నించే నాయకులను అరెస్టు చేసిన ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఆపలేరు-మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

ప్రశ్నించే నాయకులను అరెస్టు చేసిన ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఆపలేరు-మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

అలంపూర్ అక్టోబర్ 14(జనంసాక్షి )అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర నిరుద్యోగుల జీవితాల పట్ల తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు ప్రశ్నించే నాయకులను అరెస్టు చేస్తే ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఆపలేరు అని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.శనివారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షం పిలుపుమేరకు చేపడుతున్న సడక్ బందులో భాగంగా అలంపూర్ లోని జాతీయ రహదారి 47టోల్ ప్లాజా దగ్గర నిర్వహించిన సడక్ బందుకు వెళుతున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ను పోలీసులు శాంతినగర్ లోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్టు చేశారు.
ఈసందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండ ఎన్నికలు ఆరు నెలల ముందు గ్రూప్ 1 ,గ్రూప్ 2 ,గ్రూప్ 4 ,మరియు డీఎస్సీ నోటిఫికేషన్లు వేసి ఎలాంటి నియమ నిబంధన లేకుండా ప్రకటించడంతో ఇంత గంధరగోళంగా మారింది అన్నారు.లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు హైదరాబాద్ మరియు వివిధ జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర మొత్తంలో లక్షల రూపాయలు వెచ్చించి కోచింగులు తీసుకుంటున్న క్రమంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా గ్రూప్ వన్ పరీక్షను సరిగా నిర్ణయించ లేకపోవడం ,ఒకసారి రద్దీ కావడము సరియైన నిర్ణయాలు తీసుకోకుండా రెండోసారి కూడా రద్దు కావడం టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్టుంది అని అయన అన్నారు.అలాగే గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడం గ్రూప్ 4పరీక్ష నిర్వహించిన ఫలితాలు ఇవ్వకుండా మరియు టెట్ సంవత్సరానికి ఒకటి పెట్టుకుంటూ పోతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పటివరకు కూడా ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయకుండా హడావిడి ప్రకటించిన డీఎస్సీని వాయిదాలు వేసుకుంటూ పోవడం వలన నిన్న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందినటువంటి మర్రి ప్రవళిక 23 సంవత్సరాల డీఎస్సీ అభ్యర్థిని చిక్కడిపల్లిలో అశోక్ నగర్ లోని బృందావన బాలికల హాస్టల్ లో ఉంటూ అన్ని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో డీఎస్సీ కూడా వాయిదా కావడంతో హాస్టల్లోనే ఉరివేసుకొని మరణించడం జరిగింది అన్నారు.అరెస్టు అయిన వారిలో సంపత్ కుమార్ తో పాటు ఓబీసీ కార్యదర్శి మాస్టర్ షేక్షవలి, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు మద్దిలేటి, గిత్తల దేవరాజు, అలంపూర్ తాలూకాలోని అన్ని మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.