ప్రస్తుత రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కమ్ముకున్న నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ప్రస్తుత రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లకు కోర్టు అవకాశం ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఆంధ్రప్రదేశ్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. బీసీ జనగణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులపైనా సుప్రీం స్టే విధించింది.