ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40 మంది ముఖిముఖికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కోరమాండల్‌ ప్రధాన బాధ్యులు సుశాంత్‌ కుమార్‌, వ్యవసాయ కళాశాల ప్లేన్‌మెంట్‌ సెల్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.