ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన యువీ
బెంగుళూర్: టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ పునరాగమనంకోసం శ్రమిస్తున్నాడు. గత నెలలో బెంగుళూర్ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన యువీ తజాగా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అడాడు. అండర్ 19 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోన్న భారత యువజట్లుపై బరిలోకి దిగాడు కర్ణాటక ఎల్‌వెన్ తరుపున అండి 47 పరుగులు చేశాడు. ఇప్పుడిప్పుడే నిలకడగా ఉండేందుకు ప్రయత్నిస్తొన్న ఈ డాషింగ్ క్రికెటర్ టీ ట్వంటీ ప్రపంచకప్‌లో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. దానికి తగ్గట్టే 100 శాతం ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. టీ ట్వంటీ వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన 30 మంది జాబితాలో యువీకికూడా చోటు దక్కింది. తుది జట్టులో ఎంపికవడం మాత్రం అతని ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్‌లో జరుగనున్న టీ ట్వంటీ సమరానికి ముందుగా కొన్ని దేశవాళీ టోర్నీలలో తన సత్తా చాటాలని యువీ ట్రై చేస్తున్నాడు. సెలక్టర్లు కూడా అతని ఆటను చూసిన తర్వాతే తుది జట్టులోకి ఎంపిక చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. యువీ ముందు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడాలన్నదేతమ అభిప్రాయమని బోర్డు సెలక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిన విషయంపై యువరాజ్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. చివరగా నేను ఎనిమిది నెలల తర్వాత
నా మొతటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాను.47 పరుగులు చేయడంతో పాటు ఐదు ఓవర్లు బౌలింగ్ చేశాడు. 30 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌లోనూ పాల్గొన్నానని ట్వీట్ చెశాడు.