ప్రాణంతక డెంగీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా డెంగీ వ్యాది విజీంభిస్తుంది. గత రెండేళ్ల కన్నా అధికంగా ప్రజలు ఈ వ్యాది బారిన పడుతున్నారు. రోగగ్రస్తుల సంఖ్యే కాకుండా మృతుల సంఖ్యా పెరిగింది. ఈ నెల 15వరకు 216మంది డెంగీ వల్ల చనిపోయారు. గతేడాది ఈ వ్యాదితో 169మంది ప్రాణాలు కోట్పోగా, 2010లో 110మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్యకుటుంబశాఖ సహయకమంత్రి అబుహసెమ్ ఖాన్ చౌదురి, శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. డెంగీ వ్యాది వ్యాప్తి చెందుతుండగా ఇదే సమయంలో చికున్‌గున్యా, మలేరియాల తీవ్రత తగ్గిందన్నారు. గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది నవంబర్ 15 వరకు డెంగీ సోకిన వారి సంక్య 35,066 గతేడాది సంఖ్య 18,860నమోదైంది. అంటే ఏడాది కాలంలో డెంగీ బాధితుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. మృతుల్లో అత్యధికంగా తమిళనాడులో 60మంది, మహరాష్ట్రలో 59మంది ఈ వ్యాది వల్ల మరణించారు. డెంగీని నిర్ములించేందుకు వ్యాప్తిని నిరోదించేందుకు విసృతంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు మంత్రి. వ్యాధి నిర్ధారణకు 347కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. 2011లో 131లక్షల మందికి మలేరియా సోకగా వీరిలో 153మంది చనిపోయారు. ఈ ఏడాది నవంబర్ 2వరకు 7.37లక్షల మందికి మలేరియా సోకగా 153మంది మరణించారు. ఈ ఏడాది నవంబర్ 2వరకు 7.37లక్షల మందికి మలేరియా సోకగా వీరిలో 309 మరణించారు. వచ్చే ఏడాది నుంచి మూడేళ్ల గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కోర్సు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3ఏళ్ల సైన్స్ డిగ్రీ (కమ్యూనిటీ) కోర్సును ప్రారంభించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి గులాంనభి ఆజాద్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ కోర్సును రాష్ట్రాలు అంగీకరిస్తే 2013I14నుంచే ప్రారంభిస్తామన్నారు. ఈ డిగ్రీని పొందిన పట్టభద్రులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక ఆరోగ్య అధికారులు(కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్)గా నియమించుకోంటాయని మంత్రి తెలిపారు.