ప్రాణహితకు ప్రాణప్రతిష్ట చేయాలి
ఆదిలాబాద్,మే4(జనంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పునరాకృతి పేరిట జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్థన్ అన్నారు. ప్రాణహితను మయరచిపోవడం వల్ల ఆదిలాబాద్‌కు తీరని నష్టం కలుగుతందని అన్నారు. ప్రాణహితను తమ్మిడిహట్టి వద్దనే నిర్మించి జిల్లాను ఆదుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని వెల్లడించారు. ఇదిలావుంటే తెలంగాణలో ప్రాజెక్టుల పునరాకృతి పేరిట దోపిడీకి పాల్పడుతున్నారనీ సిపిఐ నేత గుండా మల్లేశ్ ఆరోపించారు. కోటి
ఎకరాల సాగు ముసుగులో ముఖ్యమంత్రి అవినీతికి తెరతీశారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పునరాకృతిపై చర్చ జరగాలన్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణమే సరైందని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పునరాకృతికి మొగ్గుచూపిందన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న ప్రభుత్వం ఆ కోటి ఎకరాల లెక్కలేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై తలెత్తుతున్న సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ¬దానే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించిన తెరాస ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చిందన్నారు. తాజాగా పాలమూరు-రంగారెడ్డిని తెర విూదకు తెస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.