ప్రాతినిధ్యం దక్కని వర్గాలకు చట్టసభల్లో చోటు
పశ్చమి యాత్రలో జగన్ హావిూ
గోఎదావరి జిల్లాల్లో 20సీట్లు మావే అన్న ఆదిమూలం
ఏలూరు,జూన్11(జనం సాక్షి): అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. 86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన సోమవారం అతిరాస కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి వారిని ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి చట్ట సభల్లోకి తీసుకొస్తామన్నారు. ఇదిలావుంటే 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ అన్నారు. దీనికి తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలోని 13 జిల్లాల్లో వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. రాష్ట్రంలో వందకు పైగా స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తామన్నారు. అబద్దపు హావిూలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ది చెప్పాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు మించి వైఎస్ జగన్ పాదయాత్రకు ఘనస్వాగతం పలకబోతున్నామని వైఎస్సార్‌సీపీ రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్ రాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో జననేత వైఎస్ జగన్ పాదయాత్ర ఒకటి మించి మరొకటి అన్నట్లుగా సాగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమలో 15 స్థానాలు గెలుస్తామన్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి ద్వారానే వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని స్పష్టం చేశారు. నాడు వైఎస్‌ఆర్ నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌తో ప్రజాసంకల్పయాత్రలో కలిసి అడుగులు వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.