ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ.

గంగారం అక్టోబర్ 20 (జనం సాక్షి)
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరచుకొని వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించి సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్
కె.శశాంక వైద్యాధికారులను ఆదేశించారు.
గంగారం మండలం కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్, నెలవారి
ఈ డి డి రిపోర్టును కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్యులు సిబ్బంది ఉన్నప్పటికీ వైద్య సేవలు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యంగా ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గ్రామాల నుండి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ లకు వెళ్లడానికి కారణాలు ఏమిటనీ కలెక్టర్ ప్రశ్నించారు. ఇకముందు గ్రామం నుండి ఏ ఒక్కరు కూడా ప్రసవానికి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళరాదని,
విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించని బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
స్థానిక సర్పంచ్ ,గ్రామ ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను వినియోగించుకునే విధంగా సహకరించాలని కలెక్టర్ సూచించారు.
మండల ప్రత్యేక అధికారి బాలరాజు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తహసిల్దార్ సూర్య నారాయణ, స్థానిక సర్పంచ్ గోగ్గల సుగుణ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, పిహెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.