ప్రాథమిక విద్యపునాదులపై దృష్టి
బైంసా, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్యావ్యవస్థ పునాదులపై దృష్టి సారిస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. శనివారం పట్టణంలో సురలోక్ గార్డెన్‌లో వాసవి స్పేస్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంసల్స్ 2013 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వెనుకబడలేదని, ఇక్కడ ఉన్నన్ని వనరులు మరెక్కడా లేవని అన్నారు. బాసరలో ఐఐటీ కావాలని అందుకే తాను పట్టుబట్టానని చెప్పారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ కే.వి. బ్రహ్మం, శ్రీనివాస రాజారాం, వాసవి విద్యాసంస్థల డైరెక్టర్ బి. రాజేశ్వర్, నిర్మల్ కార్మిక శాఖ అధికారి ముత్యంరెడ్డి, ఆత్మ చైర్మన్ ఆనంద్‌రావుపటేల్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి డార్టర్ రామకృష్ణగౌడ్, న్యాయవాది శంకర్‌పాలే పాల్గొన్నారు.