ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల ప్రదర్శన
హైదరాబాద్: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసి కార్మికులు సుందరయ్య పార్క్ నుండి బస్ భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. బస్ భవన్ వద్ద బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో వివిధ జిల్లాల నుంచి కార్మికులు తరలి వచ్చారు.