ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు
హైదరాబాద్: ఆషాఢమాస బోనాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో అమ్మవారిని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో అమ్మవారికి భక్తులు అషాఢమాస బోనాలు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. గోల్కొండకోటలో జరిగే పూజా కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. ప్రతి గురు, ఆదివారం రోజుల్లో అమ్మవార్లకు బోనాల సమర్పణ ఉంటుంది. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.