ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడు

z5zguy2z

 కరీంనగర్‌: జిల్లాలోని ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మౌనిక… అదే ఊరికి చెందిన బొల్లారపు నితిన్‌ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ‘నీవే నా ప్రాణం.. చావైనా, బ్రతుకైనా అన్నీ నీ తోనే’ అంటూ యువతిని బుట్టలో పడేశాడు. అతడి మాయమాటలు నమ్మిన మౌనిక.. అతడి ప్రేమలో పడిపోయింది. అలా మొదలైన వారి ప్రేమాయణం నాలుగేళ్ల పాటు కొనసాగింది. గతంలో మౌనికకు మరొకరితో పెళ్లి నిశ్చయం అయినా… నితిన్‌ ట్రాప్‌లో పడిపోయిన ఆమె పెళ్లికి నిరాకరించింది. అంతేకాదు ఆత్మహత్యకు యత్నించింది. ప్రేమను గెలిపించుకోవడానికి మౌనిక ఇంతచేసినా… పెళ్లి ప్రస్తావన తెచ్చే సరికి నితిన్‌ మాత్రం పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ‘నిన్ను పెళ్లి చేసుకోనని’ తెగేసి చెప్పాడు. దాంతో బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది.
నితిన్‌ను పట్టుకోలేకపోయిన పోలీసులు
కేసు నమోదు చేసుకుని 15 రోజులు గడిచినా.. నితిన్‌ను పోలీసులు పట్టుకోలేకపోయారు. దాంతో విసిగిపోయిన మౌనిక న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. ఆమె దీక్షకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి.

మహిళా సంఘాల ఆగ్రహం
ఇప్పటికైనా పోలీసులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమించి తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరిస్తున్నారు.