ప్రియురాలి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌(22) దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో  ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మనస్విని(22) తల్లిదండ్రులతో కలిసి ఆల్మాస్‌గూడలో ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొంతకాలంగా వీరిమధ్య గొడవల ఉండడం వల్లే ఆమెను మంగళవారం లాడ్జికి పిలిచి బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. మనస్వినిని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.