ప్రేమతాళాలు…పదిలంగా బంధాలు
హైదరాబాద్: సాధారణంగా తాళాలు ఇంట్లోని సామాగ్రిని భద్రంగా ఉంచుతాయి. కానీ, ఈ తాళాలు మాత్రం ప్రేమికుల బంధాన్ని పదిలంగా ఉంచుతాయి. అది ఎలానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఇది చదవండి..
జర్మనీలోని కోలోన్‌లో రైన్ నదిపై ఓ రైలు బ్రిడ్జ్ అంతా తాళాలతో నిండిపోయింది. సెకనుకొకరు అక్కడికి వచ్చి తాళాలను బ్రిడ్జికి వేసి, తాళంచెవిని నదిలో వదిలేస్తున్నారు. అవునండీ ఆ బ్రిడ్జ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రేమికులు ఎవరైనా తాళం ఆ బ్రిడ్జ్‌కు వేసి, తాళం చెవిని నదిలో వదిలేస్తే వారి బంధం పదిలంగా ఉంటుందని వారి నమ్మకం. ఇంకేముంది తమ బంధం పది కాలాలపాటు చల్లగా ఉండాలంటూ తాళాలతో ప్రార్థిస్తున్నారు.