ప్రేమ జంట ఆత్మహత్య

కరీంనగర్ :మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం అంకుశాపూర్‌కు చెందిన రమేష్‌, ఎడపల్లికి చెందిన రమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్‌, రమ ఆత్మహత్య చేసుకున్నారు.