ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.