ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి
విజయవాడ : నగరంలోని వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.