ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల సూచిని ఏర్పాటు చేయాలి
ప్రెసిడెంట్ డాక్టర్లు లేకుంటే ఆస్పత్రులు అనుమతులు రద్దు
– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు
జనం సాక్షి మిర్యాలగూడ. ప్రైవేట్ ఆస్పత్రులలో ధరల సూచిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండలరావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని ఆసుపత్రులలో తనిఖీ లు నిర్వహించిన అనంతరం పలు ఆస్పత్రులలో గల లోపాలను గమనించామని,50 పడగల ఆసుపత్రులైన మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వర్షిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తనిఖీల్లో భాగంగా మన ఆసుపత్రిలో స్థానికంగా ఉండే వైద్యులు లేని కారణంగా రోగులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని వారం రోజుల్లోగా రెసిడెంట్ డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని శోకజ్ నోటీసు జారీ చేశామన్నారు, అదేవిధంగా వర్షిత ఆస్పత్రిలో కూడా ల్యాబ్ ల నిర్వహణ సక్రమంగా లేదని వారికి కూడా షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. వారం రోజుల్లోగా వారు తమ ఆదేశాల ప్రకారం మార్చుకోకుంటే ఆసుపత్రి అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల అవగాహన కోసం రోగ నిర్ధారణ, పరీక్షలు, సేవలకు సంబంధించి ధరల సూచిని విధిగా ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు. అదేవిధంగా అడదేవులపల్లి మండల కేంద్రంలో కనీస అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్ లను సీజ్ చేసామన్నారు. ఆయన వెంట జిల్లా ఉపా వైద్యశాఖ అధికారి డాక్టర్ కేస రవి. అడవిదేవులపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ ఉపేందర్ లు ఉన్నారు.