ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం

ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం
బోడుప్పల్ లో జూట్ పేపర్ బ్యాగుల ప్రదర్శన
పర్యావరణాన్ని కాపాడాలని మేయర్ బుచ్చిరెడ్డి విజ్ఞప్తి
మేడిపల్లి – జనంసాక్షి
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత వస్తువుల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి కోరారు. స్వచ్ఛత ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినందువల్ల ప్రతి వ్యాపార సముదాయాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి వాటి స్థానంలో జూట్, పేపర్ బ్యాగులు వాడి పర్యావరణాన్ని కాపాడాలని, మెప్మా ఎస్ హెచ్ జి సహకారంతో తయారుచేసిన కాలుష్య రహిత జూట్  పేపర్ బ్యాగుల ప్రదర్శన కార్యక్రమం మేయర్ సామల బుచ్చిరెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని, మార్కెట్ అవసరాల కోసం ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా జూట్ బ్యాగులను ఉపయోగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు బొమ్మకు సుగుణ, దొంతర బోయిన మహేశ్వరి, భూక్య సుమన్ నాయక్, సీనియర్ నాయకులు మహ్మద్ అలీం, అధికారులు, ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.
Attachments area