ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే.. వాంఖడేలో గెలవాల్సిందే..!

రాత్రి 8 గంటలకు దిల్లీ-ముంబయి మ్యాచ్‌
హైదరాబాద్‌: ఐపీఎల్‌-8లో భాగంగా ఈ రోజు రాత్రి ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో సముజ్జీవులుగా ఉన్న దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌.. వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. సీజన్‌లో ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన తరుణంలో రెండు జట్లు మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు నాలుగింటిలో విజయం సాధించి 8 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉంటుంది.
దిల్లీని కలవరపెడుతున్న యువరాజ్‌ వైఫల్యం

ఐపీఎల్‌ వేలంలో అన్ని ప్రాాం’య్రజీలతో పోటీపడి అత్యధికంగా రూ.16 కోట్లు చెల్లించి తనను దక్కించుకున్న దిల్లీ డేర్‌డెవిల్స్‌కి వూరటనిచ్చే ఇన్నింగ్స్‌ ఆడటంలో యువీ ఘోరంగా విఫలమవుతున్నాడు. అనుభవం లేని దిల్లీ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు జట్టుకు మెరుపు ఆరంభాలిస్తున్నా.. దాన్ని డేర్‌డెవిల్స్‌ భారీ స్కోరుగా మలుచుకోలేకపోతోంది. కెప్టెన్‌ జేపీ డుమిని నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో అతనికి సహకరించే బ్యాట్స్‌మెన్లు కరవయ్యారు. యువరాజ్‌తో పాటు మాథ్యూస్‌ (రూ.7.5కోట్లు) వైఫల్యాల బాట వీడకపోవడంతో దిల్లీ టాప్‌ ఆర్డర్‌ ప్రస్తుతం ఆందోళనలో ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ మునుపటి ఫామ్‌ కనబరిస్తే జట్టు ఆత్మస్థైర్యం పెరిగి మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అయితే లసిత్‌ మలింగ, పొలార్డ్‌, వినయ్‌ కుమార్‌, మెక్ల్‌గాన్‌, హర్భజన్‌ సింగ్‌, సుచిత్‌తో బలంగా కనిపిస్తున్న ముంబయి బౌలింగ్‌ త్రయాన్ని ఎదుర్కొని ఆందోళనలో ఉన్న దిల్లీ టాప్‌ఆర్డర్‌ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

ఓటములతో మొదలెట్టినా.. వారెవ్వా అనిపిస్తున్న ముంబయి

భారీ హిట్టర్లతో నిండిన ముంబయి ఇండియన్స్‌ సీజన్‌ ఆరంభంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లో వరుసగా ఓడి.. అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ముంబయి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చిన్న మార్పులు చేసి జట్టులోకి సిమన్స్‌, పార్థీవ్‌ పటేల్‌ను ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగే ఈ జోడి ప్రత్యర్థి బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగి ముంబయికి తిరుగులేని ఆరంభాలను ఇస్తోంది. మిడిలార్డర్‌లో రోహిత్‌శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్‌ఈ ఆరంభాలను వినియోగించుకుని ప్రత్యర్థికి భారీ స్కోర్లతో సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం ముంబయి హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. జోరు మీదున్న ముంబయి టాప్‌ ఆర్డర్‌ను దిల్లీ బౌలర్లు జహీర్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, జేపీ డుమిని, మాథ్యూస్‌, నాథన్‌ మెరుగైన బౌలింగ్‌తో తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగితే మ్యాచ్‌పై దిల్లీ పట్టు సాధించే అవకాశం ఉంది.ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే.. వాంఖడేలో గెలవాల్సిందే..!

రాత్రి 8 గంటలకు దిల్లీ-ముంబయి మ్యాచ్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: ఐపీఎల్‌-8లో భాగంగా ఈ రోజు రాత్రి ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో సముజ్జీవులుగా ఉన్న దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌.. వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. సీజన్‌లో ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ఆడే అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన తరుణంలో రెండు జట్లు మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు నాలుగింటిలో విజయం సాధించి 8 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంటుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉంటుంది.

దిల్లీని కలవరపెడుతున్న యువరాజ్‌ వైఫల్యం

ఐపీఎల్‌ వేలంలో అన్ని ప్రాాం’య్రజీలతో పోటీపడి అత్యధికంగా రూ.16 కోట్లు చెల్లించి తనను దక్కించుకున్న దిల్లీ డేర్‌డెవిల్స్‌కి వూరటనిచ్చే ఇన్నింగ్స్‌ ఆడటంలో యువీ ఘోరంగా విఫలమవుతున్నాడు. అనుభవం లేని దిల్లీ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు జట్టుకు మెరుపు ఆరంభాలిస్తున్నా.. దాన్ని డేర్‌డెవిల్స్‌ భారీ స్కోరుగా మలుచుకోలేకపోతోంది. కెప్టెన్‌ జేపీ డుమిని నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో అతనికి సహకరించే బ్యాట్స్‌మెన్లు కరవయ్యారు. యువరాజ్‌తో పాటు మాథ్యూస్‌ (రూ.7.5కోట్లు) వైఫల్యాల బాట వీడకపోవడంతో దిల్లీ టాప్‌ ఆర్డర్‌ ప్రస్తుతం ఆందోళనలో ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ మునుపటి ఫామ్‌ కనబరిస్తే జట్టు ఆత్మస్థైర్యం పెరిగి మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. అయితే లసిత్‌ మలింగ, పొలార్డ్‌, వినయ్‌ కుమార్‌, మెక్ల్‌గాన్‌, హర్భజన్‌ సింగ్‌, సుచిత్‌తో బలంగా కనిపిస్తున్న ముంబయి బౌలింగ్‌ త్రయాన్ని ఎదుర్కొని ఆందోళనలో ఉన్న దిల్లీ టాప్‌ఆర్డర్‌ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.

ఓటములతో మొదలెట్టినా.. వారెవ్వా అనిపిస్తున్న ముంబయి

భారీ హిట్టర్లతో నిండిన ముంబయి ఇండియన్స్‌ సీజన్‌ ఆరంభంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లో వరుసగా ఓడి.. అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న ముంబయి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో చిన్న మార్పులు చేసి జట్టులోకి సిమన్స్‌, పార్థీవ్‌ పటేల్‌ను ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగే ఈ జోడి ప్రత్యర్థి బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగి ముంబయికి తిరుగులేని ఆరంభాలను ఇస్తోంది. మిడిలార్డర్‌లో రోహిత్‌శర్మ, అంబటి రాయుడు, పొలార్డ్‌ఈ ఆరంభాలను వినియోగించుకుని ప్రత్యర్థికి భారీ స్కోర్లతో సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం ముంబయి హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. జోరు మీదున్న ముంబయి టాప్‌ ఆర్డర్‌ను దిల్లీ బౌలర్లు జహీర్‌ ఖాన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, జేపీ డుమిని, మాథ్యూస్‌, నాథన్‌ మెరుగైన బౌలింగ్‌తో తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగితే మ్యాచ్‌పై దిల్లీ పట్టు సాధించే అవకాశం ఉంది.