ఫలించనున్న మహా ఒప్పందం

2

హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):మేడిగడ్డ, తుమ్మిడి హెట్టి, కొరటా- చనాఖా బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో ఒప్పందం జరగనుంది.  ఈ మూడు బ్యారేజీల కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందం చారిత్రాత్మకమని  మంత్రి హరీష్‌ రావు అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ని 101విూటర్ల ఎత్తు డిజైను తో నిర్మించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది.  అయితే 100  విూటర్ల ఎత్తు వరకే ప్రస్తుతం నీటి నిల్వ ఉంచేందుకు గేట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని మహారాష్ట్ర సిఎం అన్నారు. తుమ్మిడి హాట్టి బ్యారేజీ 148 విూటర్ల  ఎఫ్‌. ఆర్‌. ఎల్‌. తో నిర్మించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.తెలంగాణ, మహారాష్ట్ర ల  మధ్య గురువారం ముంబయి లో చర్చలు సఫలమయ్యాయి. సీఎం కెసిఆర్‌ దూతగా వెళ్లిన మంత్రి హరీష్‌ రావు మంత్రాంగం సక్సెస్‌ అయ్యింది. హైదరాబాద్‌ లో  గోదావరి అంతర్రాష్ట్ర మండలి అపెక్స్‌ కమిటీ సమావేశానికిరావలసిందిగా మహా రాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌ ను ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు ఆహ్వానించారు. ఇందుకు ఫస్న వీస్‌ సానుకూలంగా స్పందించారు.  జూలై రెండో వారంలో తాను హైదరాబాద్‌ కు రానున్నట్టు మహారాష్ట్ర సీఎం , టిఎస్‌ ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు కు హావిూ ఇచ్చారు. ముంబైలో గురువారం మహారాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌ ను హరీష్‌ రావు కలిశారు.సీఎంతో పాటు ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి  గిరీష్‌ మహాజన్‌ తో  హరీష్‌ రావు చర్చలు జరిపారు.గోదావరి ఇంటర్‌ స్టేట్‌ బోర్డు అపెక్స్‌ కమిటీ సమావేశం తేదీ నిర్ణయించాలని హరీష్‌ రావు కోరారు.తర్వాత రెండు  రాష్ట్రల ఇరిగేషన్‌ మంత్రులు, అధికారులతో గంటకు పైగా చర్చలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, ప్లాన్లు, సాంకేతిక వివరాలపై రెండు రాష్ట్రాల సెంట్రల్‌ డిజైను ఆర్గనైజేషన్స్‌(సిడివో) ఇంజనీర్లు  ఇదివరకే ఫైనలైజ్‌ చేశారు. గోదావరి అంతర రాష్ట్ర బోర్డు అపెక్స్‌ కమిటీ సమావేశానికి ముహూర్తం  జూలై రెండో వారం ఖరారైంది. తెలంగాణ, మహారాష్ట్ర ల సాగు నీటిపారుదల మంత్రలు హరీష్‌ రావు ,  గిరీష్‌ మహాజన్‌ తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌.కె. జోషి, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, భగవంతరావు చర్చలలో పాల్గొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్రకు ముంపు సమస్య లేదని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌, మహారాష్ట్రమంత్రికి వివరించారు.రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ అధికారుల బృందాలు సంయుక్తంగా జరిపిన సర్వే వివరాలపై హరీష్‌, గిరీష్‌ సవిూక్షించారు. మహారాష్ట్రలో మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల తలెత్తే ముంపు సమస్యలపై వ్యాప్కోస, రెండు రాష్ట్రాల బృందాల గ్రాండ్‌ సర్వేలు జరిపాయి . 2ూ16 ఏప్రిల్‌ 19 న  సర్వే పూర్తయింది.  గోదావరి పై తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు కు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దులలో  కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నట్లు రెండు రాష్ట్రల మంత్రులు నిర్ధారించుకున్నారు.     అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని కెసిఆ ర్‌ సంకల్పించినట్టు టి.ఎస్‌. భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌ రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. ఈ వాదనతో మహారాష్ట్ర కూడా  ఏకీభవించింది.   మహారాష్ట్ర, తెలంగాణ సంయుక్తంగా లై డార్‌ సర్వే లు నిర్వహించిన తర్వాతే ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు అవగాహనతో నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి బిఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత,  కాళేశ్వరం ప్రాజెక్టులుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది.  కాగా మహారాష్ట్ర సీఎం ఫడ్న వీస్‌, ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి గిరీష్‌ మహాజన్‌ లతో చర్చలు జరిపిన బృందంలో మంత్రి హరీష్‌ రావు తో పాటు ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్కె . జోషి, చీఫ్‌ ఇంజనీర్లు ఎన్‌.వెంకటేశ్వర్లు, భగవంతరావు, ఎస్‌ . ఇ. సుధాకరరెడ్డి

ఉన్నారు.మహారాష్ట్ర  చీఫ్‌ సెక్రటరీ స్వాధీన్‌ క్షత్రియ, ఇరిగేషన్‌  ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఐ. ఎస్‌. చహాల్‌ కూడా పాల్గొన్నారు.