ఫిఫా కప్ తీరేవేరు
మేలిమి బంగారంతో చేయించిన ఘనత
మాస్కో,జూన్7(జనం సాక్షి): 1973 నుంచి సాకర్ వరల్డ్ కప్ విజేతకు ఇచ్చే ఈ ట్రోఫీలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. రెండున్నరేళ్ల పైగా సుదీర్ఘ సమయం.. ఆరు ఖండాల్లో 872 అర్హత మ్యాచ్‌లు. వేల సంఖ్యలో గోల్స్.. కోటాను కోట్ల మంది వీక్షకులు. బరిలో 210 దేశాల జట్లు. ఆరు కిలోల సాకర్ వరల్డ్ కప్ ట్రోఫీ కోసం సాగే పోరాటం ఇదీ. ఐదు కీలోల మేలిమి బంగారంతో మెరిసే ఈ ట్రోఫీ ఒడిసిపట్టేందుకు జరిగే సంగ్రామం ఇదీ.. 6 వేల 175 గ్రాముల బరువు గల ఫిఫా వరల్డ్ కప్ లో 4 వేల 927 గ్రాముల మేలిమి బంగారాన్ని వాడారు. ఇటలీలోని మిలాన్ బెర్టోనీ కంపెనీ తయారు చేసింది. ప్రసిద్ధ శిల్పి సిల్వియా గ్జజెనిగా ఈ ట్రోఫీకి డిజైన్ చేశారు. ఈ ట్రోఫీ ఎత్తు 36.8 సెంటీవిూటర్లు కాగా.. బేస్ 12.5 సెంటీవిూటర్లు, బంగారంతో పాటు రెండు మేలైన పచ్చలు పొదించారు. ఇక విజయం సాధించిన ఇద్దరు అ/-లథెట్ల గ్లోబ్ ను మోస్తున్నట్లుగా ఈ ట్రోఫీని రూపొందించారు. 1994 నుంచి ట్రోఫీ అడుగు భాగంలోని కప్ గెలిచిన విజేతల పేర్లు రాస్తున్నారు. ఇక ట్రోపీ అడుగు భాగంలో ఇప్పటి వరకు పదకొండు సార్లు పేర్లు చెక్కబడ్డాయి. ఇక కప్ గెలిచిన విజేతకు అసలు ట్రోఫీకి బదులు బంగారు పూత పూసిన కాంస్య కప్ ను ఇస్తారు. ఇక వరల్డ్ కప్ కు ముందు రెండేళ్ల పాటు అసలు ట్రోఫీని ఫిఫా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రివీల్ చేస్తోందీ. ఈ ట్రోఫీ అక్కడి ఫుట్ బాల్ అసోషియేషన్లతో పాటు ప్రభుత్వాలు ఘనంగా స్వాగతించడం ఆనవాయితీగా వస్తోంది.మొత్తానికి ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ యావత్ క్రీడా ప్రపంచంలో వెలకట్టలేని అద్వితీయమైన బహుమతిగా మారిపోయింది. నాలుగు దశాబ్దాలుగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఈ సారి ఏ దేశం సగర్వంగా ఆకాశానికి ఎత్తుతుందో వేచి చూడాల్సిందే.